గొల్లపూడిలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం ప్రారంభం.
బొమ్మసానితో కలసి ప్రచారంలో పాల్గొన్న కేపీ.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 13.04.2024.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో శనివారం ఉదయం ఇంటింటికి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ గారికి ప్రతి గడపలో ఆత్మీయ స్వాగతం లభించింది. మీకు నేనున్నానంటూ వారందరికీ భరోసా కల్పిస్తూ ఆయన ముందుకు సాగారు. ప్రతి గుమ్మం కేపీ గారి రాక కోసం ఎదురుచూసింది. మహిళలు హారతులు ఇచ్చి విజయతిలకాన్ని నుదుటదిద్దారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ మహా కూటమి అధికారంలోకి రావలసిన ఆవశ్యకతను ఆయన వివరించారు. మైలవరం నియోజకవర్గం ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా తను కృషి చేస్తానని వెల్లడించారు. వచ్చే నెల 13న పోలింగ్ అని మీ విలువైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి టీడీపీ కూటమికి అఖండ విజయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
![](https://vasanthakrishnaprasad.in/wp-content/uploads/2024/04/IMG-20240413-WA0002-1.jpg)
![](https://vasanthakrishnaprasad.in/wp-content/uploads/2024/04/IMG-20240413-WA0005-1.jpg)
![](https://vasanthakrishnaprasad.in/wp-content/uploads/2024/04/IMG-20240413-WA0003-1.jpg)
![](https://vasanthakrishnaprasad.in/wp-content/uploads/2024/04/IMG-20240413-WA0008-1.jpg)
![](https://vasanthakrishnaprasad.in/wp-content/uploads/2024/04/IMG-20240413-WA0004-1.jpg)
![](https://vasanthakrishnaprasad.in/wp-content/uploads/2024/04/IMG-20240413-WA0001-1.jpg)
![](https://vasanthakrishnaprasad.in/wp-content/uploads/2024/04/IMG-20240413-WA0009-1.jpg)